సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన తన సందేశాల ద్వారా మరింత హింసను ప్రోత్సహించే ప్రమాదముందని పేర్కొంది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఖాతాలను 12 గంటల పాటు స్తంభింపజేస్తున్నట్లు ట్విటర్‌తో పాటు ఫేస్‌బుక్ ప్రకటించాయి.
కొత్త ఏడాదిలోనైనా సొంతిల్లు కొనగలమా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఇల్లు కలగానే మిగిలిఉంది. క్యాలండర్ మారగానే ఎక్కువ మంది ఆలోచనలు ఇంటి చుట్టూనే తిరుగుతుంటాయి. స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థల తాజా సూచీలు మీరూ ఇల్లు కొనగలవనే సూచిస్తున్నాయి. ఆదాయాలు పెరగడం, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణంతో మార్కెట్లో ఇల్లు కొనే స్థోమత గతంలో కంటే మెరుగుపడిందని చెబుతున్నాయి.
3. అఖిలప్రియ పథకం.. భార్గవరామ్ అమలు
హైదరాబాద్‌లోని రూ. రెండువేల కోట్ల విలువైన భూమిపై హక్కుల కోసం ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్‌రావులను అపహరించడం వెనుక భారీ కసరత్తు జరిగిందని బోయిన్‌పల్లి పోలీసులు గుర్తించారు. బాధితులను బెదిరించి దస్త్రాలపై సంతకం పెట్టించుకునే పథకం ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియది కాగా.. కిడ్నాప్‌కు అవసరమైన కార్యాచరణ ఆమె భర్త భార్గవ్‌రామ్, శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను చేపట్టారు. మూడు నెలల నుంచి ప్రవీణ్‌రావు కదలికలపై నిఘా ఉంచారు.
4. అప్పుడర్థం కాలేదు..
చాలా ఏళ్ల తర్వాత అనిత ఊరొచ్చిందట. ఇప్పుడెలా ఉందో? నన్ను చూడగానే ఎలా రియాక్ట్ అవుతుందో? రెట్టింపు వేగంతో జ్ఞాపకాలు నన్ను పన్నెండేళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. ఫొటోషాప్ నేర్చుకోడానికి వెళ్లినప్పుడు మొదటిసారి నా మనసు తట్టింది. చూడగానే ‘ఎంత బాగుందీ’ అనిపించేంత అందం. నా అదృష్టం కొద్దీ ఆమే మా కోర్సు ఇన్‌స్ట్రక్టర్. పక్కన కూర్చొని పాఠాలు చెబుతుంటే కడియపుసావరం మెరకచేలో విరిసిన మల్లెపువ్వు పరిమళాలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. కొద్దిరోజుల్లోనే మా మధ్య చనువు పెరిగింది.
అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక డోసులో 0.5 మి.లీ. వంతున కొవిడ్ టీకాను అందజేయనున్నారు. ప్రతి లబ్ధిదారుడికి ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇస్తారు. అంటే మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాలకు అదే టీకాను అంతే డోసులో రెండోసారీ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ద్రవరూప కొవిడ్ టీకాను సూదిమందు(ఇంజక్షన్) ద్వారా అందజేస్తారు. వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో, అత్యంత శుభ్రమైన, సురక్షితమైన ప్రదేశాల్లోనే భద్రపర్చాలని, ఎండలో ఉంచనేవద్దని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
6. ఆధిపత్యం కోసం డ్రాగన్ తహతహ
అమెరికాను అన్ని విధాలుగా అధిగమించి తానే అగ్రరాజ్యంగా ఎదగాలన్నది చైనా చిరకాల స్వప్నం. కల కనడంతోనే సరిపెట్టుకోకుండా దాన్ని సాధించడానికి పట్టుదలగా కృషి చేస్తోంది. దీనికి కాలమూ కలిసివస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం, 2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, 2020లో కరోనా వైరస్ విజృంభణ- చైనా అగ్రరాజ్యంగా ఎదగడానికి పునాదిని ఏర్పరచాయి. 2008, 2020 సంక్షోభాల నుంచి చెక్కుచెదరకుండా బయటపడిన చైనా ఈ దశాబ్దం ముగిసే లోపలే జీడీపీలో అమెరికాను మించనుంది.
7. 4 దశల్లో పంచాయతీ పోరు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శుక్రవారం రాత్రి ప్రకటించింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి ముందు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
8. అమ్మాయిలూ... మీరే మా హీరోలు!
...ఇప్పుడు అమెరికాలో ఏ నోట విన్నా ఈ మాటలే వినిపిస్తున్నాయి. ‘మన ఆడపిల్లల్లో ధైర్యం పెరగాలంటే వారి ఫొటోని చూపించండి’అని అందరూ అంటున్నారంటే వారి తెగువ అలాంటిది మరి. అక్షరాలా అగ్రరాజ్యం పరువు పోతున్న తరుణంలో వారి సాహసం అక్కడి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది. ఇంతకీ ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిని నింపుతున్న ఆ అమ్మాయిలు ఎవరు? వివరాల్లోకి వెళదాం... అమెరికాలోని క్యాపిటల్ భవనం అది.. మరో పదమూడు రోజుల్లో జరగబోయే కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి సెనెట్ సంయుక్త సమావేశం, ప్రతినిధుల సభ జరుగుతోంది.
9. ఆ దెబ్బతో కథ విలువ తెలిసొచ్చింది
‘‘నిజ జీవితంలో చూసిన మనుషులను.. జరిగిన కథను తీసుకోని పక్కా కమర్షియల్ చిత్రంగా మలచడమన్నది కత్తి మీద సాము లాంటి వ్యవహారం. కథని ఎంతో జాగ్రత్తగా మలుచుకోగలిగితే తప్ప ప్రేక్షకుల్ని మెప్పించలేం. ఇవన్నీ సరిగ్గా కుదిరిన చిత్రం మా ‘క్రాక్’’ అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రవితేజ కథానాయకుడిగా నటించారు. శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు గోపీచంద్.
10. పుజారా, పంత్ ఔట్..
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో పంత్, పుజారా ఔటయ్యారు. తొలుత హేజిల్‌వుడ్ వేసిన 88వ ఓవర్‌లో పుజారా(50; 176 బంతుల్లో 5x4) అర్ధశతకం సాధించగా అదే ఓవర్‌లో రిషభ్‌పంత్(36; 67 బంతుల్లో 4x4) స్లిప్‌లో వార్నర్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 195 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.