హైదరాబాద్: రవితేజ కథానాయకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘క్రాక్’. శ్రుతి హాసన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పోలీస్ అధికారిగా రవితేజ నటన మరోసారి మెప్పించింది. తమన్ అందించిన స్వరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇక ఇందులో ‘భూమ్ బద్దల్’ ఐటమ్ యువతను విశేషంగా ఆకట్టుకుంది. అప్సరరాణితో కలిసి రవితేజ చేసిన సందడి అలరించింది. సోమవారం ఈ సాంగ్ ఫుల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. తమన్ అందించిన స్వరాలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా, మంగ్లీ, సింహా, శ్రీకృష్ణలు ఆలపించారు. ఉర్రూతలూగించే ఆ పాటను మీరూ చూసేయండి.