నేనేనా శూర్పణఖ!


రెజీనా పరిశోధనలో ఉన్నారు. ఈ పరిశోధన దేని గురించి అంటే? ప్రస్తుతానికి సస్పెన్స్‌. తాజా చిత్రం ‘నేనేనా’లో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళంలో ‘శూర్పణగై’ (శూర్పణఖ) అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. మరి.. సినిమాలో శూర్పణగై రెజీనానేనా? లేదా వేరే ఎవరైనానా అనేది తెలియాల్సి ఉంది. కార్తీక్‌ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ మంగళవారం ఆరంభమైంది. హారర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పరిశోధన ఆసక్తికరమైన సంఘటనలకు దారి తీస్తుందట. ఆ తర్వాత నుంచి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే మలుపులతో సినిమా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.

Post a Comment

أحدث أقدم