తాండూరు టౌన్, న్యూస్‌టుడే: మద్యం మత్తులో బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఓ వ్యక్తితోపాటు అతడి స్నేహితుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింలు, అంజన్న వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు. నర్సింలు భార్యతో తగవు పడగా.. ఆమె నాలుగు రోజుల కిందట పిల్లల్ని తీసుకుని ఊరెళ్లి పోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆదివారం విందు చేసుకుందామని నర్సింలు.. అంజన్నను పిలిచాడు. ఇద్దరూ మద్యం తాగారు. అంజన్న మత్తులోకి వెళ్లగా.. నర్సింలు బయటకు వెళ్లి ఏడేళ్ల బాలికను బలవంతంగా తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. తలుపులు మూసి అత్యాచారానికి యత్నించాడు. బాలిక బిగ్గరగా అరవడంతో ఇరుగు పొరుగు వారు విని ఇంటి తలుపులు బలవంతంగా తెరిచారు. అంజన్న, నర్సింలులను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు
పాడుబుద్ధి.. దేహశుద్ధి.. బాలికపై అత్యాచార యత్నంఇద్దరిని చితకబాదిన గ్రామస్థులు
AMARAVATHI NEWS WORLD
0