నాని సినిమా తరహా ఘటన.. కబడ్డీ కూతకు వెళ్లి..

 వైఎస్సార్‌ : జిల్లాలో భీమిలి కబడ్డీ జట్టు సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లిన ఆటగాడు అవుట్‌ అయిన తర్వాత తిరిగొస్తూ గుండెపోటు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే మృతి చెందాడు. వల్లూరు మండలంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వల్లూరు మండలంలోని గంగాయపల్లి మోడల్‌ స్కూల్‌ ఆవరణలో ఆర్కే యువసేన  ఆధ్వర్యంలో శనివారం కబడ్డీ పోటీలు జరిగాయి. చెన్నూరు, తప్పెట్ల గ్రామాల జట్లు తలపడ్డాయి. 


కొండపేటకు చెందిన నరేంద్ర ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లాడు. అవుట్‌ అయిన తర్వాత వెనక్కు తిరిగొస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. దీంతో నరేంద్ర సొంత గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Post a Comment

أحدث أقدم