చోరీ విఫలమై.. ఏటీఎంకు నిప్పు


కాలిబూడిదైన రూ.5.80 లక్షలు
అనుమానితుడి ఆత్మహత్య

చోరీ విఫలమై.. ఏటీఎంకు నిప్పు

హిందూపురం, పరిగి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇండియన్‌ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమవడంతో ఏటీఎం యంత్రాన్ని పెట్రోలు పోసిచోరీ విఫలమై.. ఏటీఎంకు నిప్పునిప్పంటించారు. ఈ ఘటనలో ఏటీఎంలోని రూ.5.80 లక్షలు కాలి బూడిదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం ఏటీఎంలో రూ.9 లక్షల నగదు ఉండగా.. ఖాతాదారులు రూ.3 లక్షలు డ్రా చేశారు. మిగతా రూ.6 లక్షల్లో అదేరోజు అర్ధరాత్రి రూ.22 వేలు డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. మిగతా రూ.5.80 లక్షలు ఏటీఎంలోనే ఉన్నాయి. అదే సమయంలో దుండగులు ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసి, చివరకు పెట్రోలు పోసి యంత్రాన్ని కాల్చివేశారు. శుక్రవారం ఉదయం పరిగి పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి ఏటీఎంలోకి ఇద్దరు వ్యక్తులు చొరబడినట్లు గుర్తించారు. వారిని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హిందూపురం పట్టణంలో గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో ఏటీఎంలో చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్న మనోజ్‌కుమార్‌(21) ఆబాద్‌పేటలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడు హిందూపురం సమీపంలో ఓ కర్మాగారంలో దినసరి కార్మికుడిగా పని చేసేవాడు. చోరీకి యత్నించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post