అమరావతి : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి జరిమానాతో పాటు జైటు శిక్షను విధించేందుకు ఏపీ ప్రభుత్వం చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారం ఎన్నికల ప్రక్రియను 14 రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణల పేరిట గత ఏడాది జనవరిలోనే వైసీపీ ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. వీటికి సంబంధించి గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ఇచ్చారు. ఈ బిల్లును శాసనసభ ఆమోదించినా మండలిలో చుక్కెదురైంది. దీన్ని రెండోసారి శాసనసభ ఆమోదించినా మండలిలో మరోసారి తిరస్కరణ ఎదురైంది.అయితే రెండోసారి మండలిలో వ్యతిరేకించినా చట్టం చేయవచ్చనే నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరుపరి కార్యాచరణను పూర్తి చేసింది. ఈ చట్టం ప్రకారం ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆ తర్వాత రుజువైతే... అలాంటి సర్పించి, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రూ. 10 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్షను విధించనున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను 16 రోజుల్లో పూర్తి చేయాలి.
కొత్త చట్టాల్ని తీసుకోచున AP ప్రభుత్వం.. ఇక జైలుకే
AMARAVATHI NEWS WORLD
0