అమరావతి : ఇటీవల ఎపి లోని దేవాలయాలపై వరుస దాడులు కొనసాగుతోన్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆలయాలపై జరుగుతోన్న దాడులపై విచారణకుగాను.. ఎసిబి అడిషనల్ డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణాజిల్లా ఎస్పీ రవీంధ్రనాథ్ బాబుతోపాటు 16 మంది సభ్యులు ఈ సిట్ లో ఉండనున్నారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీ లు, ఇద్దరు ఏసీపీ లు, నలుగురు సీఐ లు, నలుగురు ఎస్సై లతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు కానుంది.
డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు..
అన్ని జిల్లాల ఎస్పీలు ఈ బృందానికి సహకరించాలని, సీఐడీ, ఇంటెలిజెన్స్ బృందాలు కూడా సిట్ బృందానికి సహకరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.కేసుల తీవ్రత దృష్ట్యా సైబర్ క్రైమ్ విజయవాడ, విశాఖపట్నం బృందాలు సిట్ బృందానికి సహకరించాలని, సిట్ బృందం ఎప్పటికప్పుడు కేస్ దర్యాప్తు పురోగతిని శాంతిభద్రతల అడిషనల్ డీజీకి వివరించాలని పేర్కొంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.