మహిళలకు రక్షణ లేకుండా ..
ఈ ఘటనకు సంబంధించి ముుగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా... అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో జార్ఖండ్‌లో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోయాయి. గతేడాది డిసెంబర్‌లో జార్ఖండ్‌లోని దుంకా జిల్లాలో భర్తతో కలిసి సంతకు వెళ్లి తిరిగొస్తున్న ఓ వివాహిత గ్యాంగ్ రేప్‌కు గురైంది. అంతకుముందు,ఖుంతీ జిల్లాలోని కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. జార్ఖండ్ క్రైమ్ గణాంకాల ప్రకారం గతేడాది జులై వరకు రాష్ట్రంలో 1033 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తం 1,416 అత్యాచార కేసులు నమోదవగా... 2020లో 7 నెలల కాలంలోనే వెయ్యికి పైగా అత్యాచార కేసులు నమోదవడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది.
50 ఏళ్ల వివాహిత అయిన..
ఉత్తరప్రదేశ్‌లోని బదౌని జిల్లా ఉఘాటిలో 50 ఏళ్ల వివాహిత అయిన ఓ అంగన్ వాడీ కార్యకర్తపై జరిగిన గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. సాయంత్రం సమయంలో ఇంటి నుంచి స్థానిక ఆలయానికి వెళ్లిన ఆమె గ్యాంగ్ రేప్‌కి గురైంది. బాధితురాలి జననాంగాల్లో ఇనుప రాడ్లు దూర్చి దుండగులు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.కాలు,పక్కటెముకలను కూడా విరగ్గొట్టినట్లు పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. ఆలయ పూజారి,అతని శిశ్యులే అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. అంతకుముందు,ఇదే యూపీలో జరిగిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.