తమ ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను మొబైల్‌లో బంధించడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. జ్ఞాపకంగా ఉంచుకోవడం కోసం లవర్స్ అలా చేస్తుంటారు. కానీ అది ఎంత ప్రమాదకరమో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటననే నిదర్శనం. ఓ ప్రేమ జంట తమ జ్ఞాపకార్థం ప్రైవేట్ ఫోటోలు దిగి పెన్ డ్రైవ్‌లో బంధించుకుంది. అది కాస్త మరో వ్యక్తి చేతిలో పడింది. దీంతో అతడు ఆ లవర్స్‌కు ఫోన్ చేసి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. అలా చేయకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని వారిని బ్లాక్‌మెయిల్ చేశాడు. అతని వేధింపులు తాళలేక ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌కి చెందిన ఓ లా స్టూడెంట్(21),ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి ఇటీవల తమ సహచర లా స్టూడెంట్స్‌తో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లారు. అక్కడినుంచి తిరిగొస్తున్న క్రమంలో మథుర హైవే పక్కనున్న ఓ హోటల్ వద్ద భోజనం చేసేందుకు ఆగారు. ఆ సమయంలో తమ లగేజీని ఓ టేబుల్ పక్కన పెట్టారు. తిరుగు ప్రయాణంలో బ్యాగ్‌లో ఉన్న పెన్‌డ్రైవ్ అక్కడే పడిపోయింది. అది ఓ వ్యక్తికి దొరికింది. అందులో లవర్స్ ప్రైవేట్ ఫోటోలు ఉండటంతో వారిని బ్లాక్ మెయిల్ చేయాలని భావించాడు.