అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి హిట్ల తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న మూడో చిత్రమిది. నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బన్నీ గుబురు గడ్డం.. డీగ్లామర్ లుక్‌తో చేతిలో గొడ్డలి పట్టుకొని ఊరమాస్ అవతారంలో దర్శనమిచ్చారు. ‘‘ఎర్ర చందనం అక్రమ రవాణా కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇది. పుష్పరాజ్ అనే స్మగ్లర్‌గా అల్లు అర్జున్ కనిపిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ షెడ్యూల్‌లో బన్నీతో పాటు ఇతర ప్రధాన తారగణం పాల్గొంటుంది. రష్మిక పాత్ర చాలా సహజసిద్ధంగా ఉంటుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్.
ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు ‘పుష్ప’రాజ్
AMARAVATHI NEWS WORLD
0