హైదరాబాద్: కొత్త రకం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గత రెండు వారాల్లో యూకె నుంచి 1200 మంది రాగా... ఇందులో నగరానికి చెందినవారు ఎంతమంది ఉన్నారో ఆరా తీస్తున్నారు.ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా ఉన్నట్లయితే గచ్చిబౌలిలోని టిమ్స్‌తో పాటు గాంధీలో చికిత్స అందిస్తారు. నెగిటివ్ వచ్చినాసరే 14 రోజులు హోం క్యారెంటైన్‌లో ఉండాల్సి ఉంది. 300 ఐసీయూ పడకలు సిద్ధం చేశామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ప్రస్తుతం గాంధీలో సాధారణ కరోనా రోగులు 119 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 68 మంది ఐసీయూలో ఉన్నారు.
పట్టని జీహెచ్‌ఎంసీ
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు కరోనా
కాటేదాన్, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్‌గౌడ్ కొవిడ్-19 బారిన పడ్డారు. బుధవారం ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశారు. ఆయన డ్రైవర్‌కు సైతం వైరస్ సోకింది. అభివృద్ధి కార్యక్రమాల్లో తనతో పాటు పర్యటించిన పార్టీ నేతలు పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్ ద్వారా కోరారు.