బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య


బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య

గార్ల: మహబూబాబాద్‌ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. గార్ల మండలం రాజుతండా గ్రామపంచాయతీ పరిధిలోని వడ్ల అమృతండా సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకి ప్రశాంత్‌, ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మంలో పదో తరగతి చదువుతున్న బాలుడు, డిగ్రీ చదువుతున్న ఓ యువతి (21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం సోమవారం సాయంత్రం ఇంట్లో తెలిసింది. దీంతో భయాందోళనకు గురైన ప్రేమజంట ఇంటి నుంచి వెళ్లిపోయారు. 

అనంతరం తండా శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం అటువైపుగా వెళ్తున్న రైతులు బావిలో శవాలు పడి ఉండటాన్ని చూసి తండా వాసులకు సమాచారం అందించారు. తండా వాసులంతా ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించగా.. మృతులు తమ తండాకు చెందిన వారేనని గుర్తించారు. బంధుమిత్రులు, తండా వాసుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం తెలుసుకున్న గార్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Post a Comment

أحدث أقدم