హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..


హైదరాబాద్‌: ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద కేటిఎం స్పోర్ట్స్‌ బైక్‌తో ఇద్దరు యువకులు అతివేగంగా జేసీబీని ఢీకొట్టారు. బైక్‌పై ప్రయాణిస్తున్న నరేష్ (22), గణేష్(20) అనే యువకులు దుర్మరణం పాలయ్యారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. రామంతాపూర్ నుండి ఉప్పల్ వైపు బైక్‌పై అతి వేగంగా వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన నరేష్‌.. భువనగిరి ఆకుతోట తండా సూరేపల్లికి చెందిన వ్యక్తి కాగా, గణేష్‌.. పోచారం ఘట్కేసర్‌కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉప్పల్‌ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم