హైదరాబాద్: ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్ నంబర్, వేలి ముద్రల ఫోటో, నీటి చుక్కల సాయంతో పలువురు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీకి చెందిన రెవెన్యూ వెబ్‌సైట్ నుంచి నిందితులు భూముల దస్తావేజులు డోన్‌లోడ్ చేసుకున్నారు. దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటోలతో బ్యాంకు అకౌంట్ నుంచి మధురానగర్‌కు చెందిన సిద్ధిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఖాతాలోని రూ.10 వేలు కాజేశారు.
ఈమేరకు బాధితుడు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేపాయింట్ ద్వారా డబ్బు స్వాహా చేసినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. నిందితులు విశాల్, అర్షద్‌లను సీఏ విద్యార్థులుగా గుర్తించారు.