‘షకీలా సినిమాలు ఆగిపోవటం మంచిది’


‘షకీలా సినిమాలు ఆగిపోవటం మంచిది’

హైదరాబాద్‌: ‘నేను కేవలం ఈ శరీరాన్ని గుర్తింపుగా మార్చుకోవాలనుకోవడం లేదు. ఇది మీకోసం కాదు నా కోసం చేస్తున్నా’ అంటున్నారు రిచా చద్దా. అలనాటి శృంగార తార షకీలా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘షకీలా’. పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంద్రజిత్‌ లంకేశ్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

నాటకాలంటే అభిమానంతో నటన మొదలు పెట్టిన షకీలా వెండితెరపై ఎలా అవకాశాలు దక్కించుకుంది? ఆమె కెరీర్‌లో ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొంది? ఒకానొక దశలో అగ్ర హీరోలను సైతం పక్కకు నెట్టి ఏవిధంగా స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది? అదే సమయంలో ‘షకీలా సినిమాలు ఆగిపోవాలి’ అన్న స్థాయిలో వివాదాలు రావటానికి కారణం ఏంటి? ఇలా షకీలా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇంద్రజీత్‌. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ‘షకీలా’ ట్రైలర్‌ను చూసేయండి.

Loading video

Post a Comment

Previous Post Next Post