మొయినాబాద్, న్యూస్‌టుడే: ఆన్‌లైన్ తరగతులు వినేందుకు తల్లిదండ్రులు ఇప్పించిన స్మార్ట్‌ఫోన్ ఓ బాలికను తప్పుదారి పట్టించింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన బాలుడు.. బాలికకు మాయమాటలు చెప్పి ఏకంగా తాను ఉండే ప్రాంతానికి రప్పించుకున్నాడు. ఇంట్లో ఉండాల్సిన కూతురు కన్పించకపోవడంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13), స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. ఇంట్లోనే ఆన్‌లైన్ తరగతులు వినేందుకు తల్లిదండ్రులు స్మార్‌ఫోన్ కొన్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(16).. బాలికకు మాయమాటలు చెప్పి ఆరు మాసాలుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక బయటకు వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక కన్పించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ జాడ దొరక్కపోవడంతో అదేరోజు రాత్రి మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ బాలుడి ప్రేమ వ్యవహారంసు రక్షితంగా ఇంటికి చేర్చిన మొయినాబాద్ పోలీసులు