బికినీ ఫొటోపై విమర్శలు.. కంగనా ఏ రేంజ్‌లో కౌంటరిచ్చిందంటే..



బికినీ ఫొటోపై విమర్శలకు కంగనా కౌంటర్ మహారాష్ట్రలో అధికార శివసేనతో జరిగిన వివాదంతో నలుగురి నోళ్లలో నానిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే.. ఈసారి ఆమెపై వచ్చిన విమర్శలు రాజకీయంగా చేసినవి కావు. తన ట్విట్టర్, ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటో కారణంగా ఆమె మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం ఉదయం ఆమె తన ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తన జీవితంలో.. తాను ఎంతో కుతూహలంతో వెళ్లిన అద్భుతమైన, అందమైన ప్రదేశాల్లో మెక్సికో ఒకటని పోస్ట్ చేసిన కంగనా.. మెక్సికోలోని తులుం అనే చిన్న ఐలాండ్‌లో దిగిన ఫొటో ఇదేనంటూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. కంగనా బికినీ ధరించి బీచ్‌లో కూర్చుని ఉండగా.. సముద్రంలోని అలలను చూస్తున్న సందర్భంలో ఫొటో తీసినట్టుగా ఉంది. కంగనా ఈ ఫొటో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. గతంలో భారతీయ సంప్రదాయాలు, విలువల గురించి తరచుగా ప్రస్తావించిన కంగనా ఇలాంటి దుస్తుల్లో కనిపించడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విమర్శలపై స్పందిస్తూ.. కంగనా మరో పోస్ట్ పెట్టింది. తన బికినీ ఫొటోను చూసి కొందరు వ్యక్తులు తనకు సనాతన ధర్మం గురించి హితబోధ చేస్తున్నారని వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. అంతేకాదు, భైరవి దేవత జుట్టు విరబోసుకుని, దుస్తులు లేకుండా, రక్తం తాగుతూ మీ ముందు నిలబడితే మీరేం చేస్తారని కంగనా ప్రశ్నించింది. మీరు భయపడతారని, ఆ సందర్భంలో మిమ్మల్ని మీరు భక్తులుగా చెప్పుకోరా అని ఆమె నిలదీసింది. మతంపై మీకే అధికారమున్నట్లు నటించొద్దని కంగనా కౌంటర్ ఇచ్చింది. పోస్ట్ ముగింపులో ‘జై శ్రీరామ్’ అని కంగనా పోస్ట్ చేయడం గమనార్హం.

Post a Comment

Previous Post Next Post