2021: ప్రపంచం అతలాకుతలమేనట!


2021లో ప్రకృతి వినాశనం తప్పదా?

బాబా వంగ.. బహుశా చాలామందికి ఆమె పేరు తెలిసుండదు. కానీ ఒక్కసారి ఆమె గురించి తెలిస్తే మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. ఇంతకీ ఆమెలో అంత ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? మరేం లేదు. మన దగ్గర పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఆమె కూడా కాలజ్ఞాని. భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆమె ముందే అంచనా వేసి చెప్పగా, వాటిలో చాలావరకు నిజమయ్యాయట. మరి ఆమె 2021 సంవత్సరం గురించి ఏం చెప్పిందో తెలుసుకునే ముందు ఆమెవరో? కాలజ్ఞానిగా ఎలా మారిందో ముందుగా తెలుసుకుందాం.. 

చూపు పోయింది కానీ..
బల్గేరియాకు చెందిన బాబా వంగ అసలు పేరు వెంజీలియా పెండెవా దిమిత్రోవా. పన్నెండేళ్ల వయసులో వచ్చిన టోర్నడో ఆమె చూపును మింగేసింది. కానీ ఆశ్చర్యంగా రానున్న కాలంలో ఏం జరగనుందనే విషయాలను కళ్లకు కట్టినట్లు చెప్పే అద్భుత శక్తిని పొందింది. దీంతో ఆమెను బల్గేరియాలో నోస్ట్రడామస్‌(ఫ్రెంచ్‌ కాలజ్ఞాని)తో సమానంగా చూసేవారు. ఆమె ఎన్నో విపత్తులు, వైపరీత్యాలను ముందుగానే చెప్పేవారట. ఈ క్రమంలో ఆమె చెప్పిన సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్‌ అణు ప్రమాదం, పుతిన్‌పై హత్యాయత్నం అన్నీ నిజంగానే జరిగి తీరాయి. 1996లో ఆమె మరణించేముందు 2021లో జరగబోయేవాటి గురించి తెలిపింది. 

Post a Comment

أحدث أقدم