Ap ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఆరా సంస్థ తన అంచనాలను వెల్లడించింది. ఏపీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గెలుపుపై ఆరా సంస్థ తన అంచనాను వెల్లడించింది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించి.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉందని ఆరా సంస్థ తెలిపింది. భారీ మెజార్టీతో ఆయన విజయం సాధిస్తారని పేర్కొంది. వంగా గీత గట్టిపోటీ ఇస్తారని అంతా భావించారు. పోలింగ్ ముగిసిన తర్వాత పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు తేలింది. అసలు ఫలితం జూన్4న రానున్నప్పటికీ ఇటీవల కాలంలో ఎగ్జిటపోల్స్ రియల్ రిజల్ట్‌కు దగ్గరగా ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో పిఠాపురంలో జనసేన జెండా ఎగరబోతుందని ఆరా సంస్థ అంచనా వేసింది.
ఆరా సర్వే పిఠాపురంలో సంచలన విజయం ఎవరిదంటే
AMARAVATHI NEWS WORLD
0