5కోట్ల,62లక్షల ఆసరా చెక్కును ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన నిబద్ధతగల నేత సీఎం జగన్.... ఎన్నికల తర్వాత హామీలను మర్చిపోయే మోసకారి చంద్రబాబు 12వందల కోట్లతో వైఎస్ఆర్,సీఎం జగన్ 20వేల మంది గుడివాడ ప్రజల సొంతింటి కల నిజం చేశారు..
చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలు నుండి తప్పకుంటా.... టిడిపి నేతలు తన సవాల్ స్వీకరించాలి
గుడివాడ06:గుడివాడ టౌన్ మరియు రూరల్ మండలాల పరిధిలో నాలుగో విడత ఆసరా కార్యక్రమం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో వేలాదిమంది మహిళమ్మ తల్లుల సమక్షంలో మంగళవారం ఘనంగా జరిగింది.మండల పరిధిలో గల 698 గ్రూపులలోని 6వేల,932 మంది సభ్యులకు విడుదలైన 5కోట్ల,62లక్షల,16వేల,923 రూపాయల ఆసరా జంబో చెక్కును ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. తొలుత మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సమైక్య నేతలు స్వర్గీయ వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎ