అమరావతి న్యూస్ వరల్డ్ 🌾ప్రేక్షకులకి సంక్రాంతి 🦚శుభాకాంక్షలు


 ఈ సంక్రాంతి 🌾కొత్త వెలుగులు నింపాలని మనసారా 🦚కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.🌾

మీ బంధు మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేయండి. పచ్చ తోరణాలతో, పాడి పంటలతో, భోగి సందళ్ళతో, ముంగిట ముగ్గులతో వచ్చే పండుగ సంక్రాంతి.

ఈ సంక్రాంతి పండుగ అర్థం ‘సం’ అంటే మంచి అని. ‘క్రాంతి’ అంటే అభ్యుదయం అని భావం.
ఈ సందర్భంగా మీ అందరి కోసం కొన్ని సందేశాలను, కోట్స్ ను మీ ముందుకు తీసుకవచము. వీటిలో మీకు నచ్చిన వాటిని మీ బంధు మిత్రులకు పంపి శుభాకాంక్షలు తెలియచేయండి..

తెలుగు వారికి , తమిళులకు ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో 4 రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుకుంటారు. సాధారణంగా సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదిన జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే 15వ తేదీన జరుపుకుంటారు.
మకర సంక్రాంతి (Makar Sankranti) రోజు నుంచి సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం వైపు వెళ్తాడు. ఈ సమయం నుంచి క్రమంగా చలి తగ్గుతూ… తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.

Post a Comment

Previous Post Next Post