పల్లె బాట పట్టిన పట్నం హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు. ఈ క్రమంలో పంతంగి, కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు వరుస కట్టాయి. ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపిస్తుండటంతో మరింత జాప్యం జరుగుతోంది అంటున్నారు

హైదరాబాద్‌ నుంచి సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ వైపు హైవే రద్దీ పెరిగింది. టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ కనిపిస్తోంది. చౌటుప్పల్‌ ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పలు కూడళ్ల దగ్గర ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు.
పంతంగి వద్ద టోల్‌ ప్లాజా దాటేందుకు సుమారు పది నిమిషాలకుపైనే సమయం పడుతోంది. మొత్తం 18 టోల్‌ బూత్‌లు ఉండగా విజయవాడ మార్గంలోనే 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఏర్పాట్లు చేశారు.. అదనపు టోల్ బూత్‌లను కూడా తెరిచారు. ఎక్కడా ట్రాఫిక్ స్తంభించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post