పవన్ భార్యల వాక్యలపై జగన్ కి, మంత్రులకు ఈ మహిళ ఇచ్చిన కౌంటర్ మమూలుగా లేదు
ఆ మధ్యన నాగార్జున నటించిన కింగ్ సినిమాలో బ్రహ్మానందం కామెడీ డైలాగులు ఇప్పటికీ ట్రోల్ అవుతుంటాయి. బ్రహ్మానందానికి నాగార్జున కొట్టే తీరును కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి శ్రీహరికి వివరిస్తాడు ఒక శివమణి జోగ్స్ కొట్టినట్లు.. జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్లు.. శంకర్ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొట్టినట్టు.. ఒక్క మాటలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు ” అంటూ శ్రీనివాస్ రెడ్డి చెప్పే ఈ డైలాగు కడుపుబ్బ నవ్విస్తుంది. ఇప్పుడు సేమ్ సీన్ మాదిరిగా ఓ మహిళ సీఎం జగన్ నుంచి మంత్రుల వరకు ఉతికి ఆరేసింది. పవన్ పై వ్యక్తిగత దాడి నుంచి.. రిషికొండలో నిర్మాణాల వరకు చాకి రేవు పెట్టింది.
సమకాలిన రాజకీయ అంశాలపై ఓ సాధారణ మహిళ మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ముందుగా మంత్రి రోజాతో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బండారు సత్యనారాయణమూర్తి అంత పెద్ద ఆరోపణ చేస్తే తేలిగ్గా ఎందుకు తీసుకున్నావ్ అని ప్రశ్నించారు. వారు చెబుతున్న వీడియోలు బయటకు వస్తాయనే కదా? అని నిలదీశారు. ఏమైనా చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును రోజా ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. మరి అదే పవన్ కళ్యాణ్ కోర్టు నుంచి విడాకులు తీసుకుంటే ఎందుకు తప్పు పట్టావు అంటూ గట్టిగా నిలదీశారు.
సీఎం జగన్ సైతం ఆ మహిళ విడిచిపెట్టలేదు. 16 నెలలు జైలుకు వెళ్ళింది నువ్వు కాదా? 43 వేల కోట్ల ఆస్తులను ఈడి అటాచ్ చేయలేదా? లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు నీమీద లేవా? అవినీతి కేసుల్లో మీరు నిందితులు కారా? కోడి కత్తి కేసులో మీరు బాధితులు కాదా? అలా అయితే మీరు ఎందుకు బయట ఉన్నట్టు? ప్రశ్నల వర్షం కురిపించారు. రిషికొండ నిర్మాణాలపై సైతం చెడుగుడు ఆడేశారు. సముద్ర తీరంలో రిలాక్స్ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? అని ప్రశ్నించారు. సొంత నిర్మాణాలు మాదిరిగా.. అక్కడ కార్యాలయాలు కొట్టుకుంటారా? దానికి మీ సొంత సొమ్ము ఏమైనా పెడుతున్నారా? అంటూ నిలదీశారు.
చంద్రబాబు అరెస్టుపై సైతం మాట్లాడారు. తులు త మూడు వేల కోట్లు అవినీతి జరిగిందన్నది మీరు కాదా? తరువాత దానిని 271 కోట్ల రూపాయలు అని చెప్పిన విషయం నిజం కాదా? చివరికి 27 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా వచ్చిందని చెబుతున్నారు. మరి మీ పార్టీకి వచ్చిన విరాళాలు ఎక్కడ నుండి వచ్చాయి? ఎలా వచ్చాయి? అన్నది చెప్పొచ్చు కదా అంటూ డిమాండ్ చేశారు.
ఇక నదీ జలాల గురించి ఆ మహిళ సమగ్రంగా మాట్లాడారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో అంత నష్టం జరుగుతుంటే నోరు మెదపడం లేదు ఎందుకు? రాయలసీమకు అన్యాయం చేస్తుంది మీరు కాదా? రాయలసీమలో రాజకీయం చేస్తున్నది మీరే కదా? మీరు రాయలసీమ బిడ్డే కదా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారా? మీ మౌనం దేనికి సంకేతం? ఈ రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచిస్తున్నారు. మీకు ప్రజా గుణపాఠం తప్పదు.. అంటూ ఆమె హెచ్చరిక ధోరణితో మాట్లాడారు.ఆమె ధైర్యానికి, సమయస్ఫూర్తికి, సమకాలిన రాజకీయ అంశాలపై అవగాహనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఆవేదనతో వైసిపి దరిధ్రులకు హెచ్చరిక చేసిన ఓ తల్లిఆవేదన అమ్మ నువ్వు ఎవరో తెలియదు కానీ నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న తల్లి. ఎవరైనా ఆవేశంగా తిడతారు, కోపంగా తిడతారు ,అసహ్యంగా తిడతారు. నువ్వు మాత్రం పద్ధతిగా తిట్టావు తల్లి అంటూ అభినందనలతో ముంచేత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టును ట్రోల్ చేస్తున్నారు.
http://amaravathinewsworld.blogspot.com/2023/10/blog-post.html
https://whatsapp.com/channel/0029Va8zbJj5vKAEu76PWo31