కొవిడ్‌ ఆసుపత్రిలో కొట్లాట


Viral: కొవిడ్‌ ఆసుపత్రిలో కొట్లాట


ఇండోర్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా రోగి బంధువులకు, ఆసుపత్రి సిబ్బందికి మధ్య ఘర్షణ తలెత్తింది. బిల్లు విషయంలో రోగి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. అది కాస్తా వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొవిడ్‌ చికిత్స కోసం రవిప్రకాశ్‌ అనే వ్యక్తి చిరాయు ఆసుపత్రిలో చేరారు. కాగా హాస్పిటల్‌లో అదనపు ఛార్జీ వసూలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ తలెత్తినట్లు రోగి బంధువు పేర్కొన్నారు. కొవిడ్‌ ఆసుపత్రిలో ఘర్షణ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పరస్పర దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

Previous Post Next Post