టాప్‌ 10 బ్రేకింగ్ న్యూస్



1. ఓటేస్తావా.. నోటిస్తాను

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. నగదు, మద్యం సీసాలు, స్వీటు బాక్సులు, క్రికెట్‌కిట్లు చివరకు కొందరికి మేకపోతులు కూడా పంపిణీ చేస్తూ ఓటర్లపై వల విసురుతున్నారు. 

2. ఆగస్ట్‌ 1న నీట్‌

 నీట్‌ యూజీ-2021 పరీక్షను ఆగస్టు 1న నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆయా కోర్సులను నియంత్రించే సంస్థలు జారీచేసిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించనున్నారు. 

3. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం.. అందరిదీ

 హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రం (ఇండో-పసిఫిక్‌)పై అందరికీ హక్కుందని క్వాడ్‌ దేశాల నేతలు ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలో అన్ని దేశాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించడానికి అవకాశం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టంచేశారు. ఈ ప్రాంత సుస్థిరత కోసం అమెరికా తన భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేయాలన్న నిబద్ధతతో ఉందని తెలిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా రకరకాల యత్నాలు, దుందుడుకు వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

4. ‘‘ప్రభుత్వ అధికారులను ఎస్ఈసీలుగా నియమించకూడదు’’

ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తున్నవారిని రాష్ట్ర  ప్రభుత్వాలు ఎన్నికల కమిషనర్లుగా నియమించరాదని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారికి ఎన్నికల కమిషనర్‌ బాధ్యతలను అదనంగా అప్పగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ హృషికేష్‌రాయ్‌లతోకూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి నేతృత్వం వహించే వ్యక్తి స్వతంత్రుడై ఉండాలని పేర్కొంది. 

5. పోలీసులూ! పిల్లను చూసి పెట్టరూ!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని శామలీ మహిళా పోలీస్‌స్టేషన్‌కు ఓ అసాధారణ దరఖాస్తు అందింది. రెండడుగుల పొడవున్న అజీం (26) అనే యువకుడు కుటుంబసభ్యులు తన పెళ్లి గురించి పట్టించుకోనందున, తనకో పెళ్లిసంబంధం చూసిపెట్టాలని అందులో కోరాడు. ఇది చూసి విస్తుపోయిన పోలీసులు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘అది మా పని కాదు. దంపతుల మధ్య గొడవలుంటే పరిష్కరించగలం’ అని ఎస్‌హెచ్‌వో నీరజ్‌ చౌధరి తెలిపారు. 

6. స్థిరాస్తుల్లో ఆమె అడుగులు

మహిళలు ఎక్కువగా బంగారంపై మక్కువ చూపిస్తుంటారు. ఇప్పటికీ ఇది కొనసాగుతున్నప్పటికీ.. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా వీరి ప్రాధాన్యాలు మారుతున్నాయి. స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. వృత్తి, ఉద్యోగంలో చేరగానే వచ్చే సంపాదనతో పుత్తడి, షేర్లతో పాటూ స్థలాలు, ఇళ్లపైన వెచ్చించేందుకు ముందుకొస్తున్నారు. వీరు 9 శాతం వరకు ఉంటారని అనరాక్‌, ట్రాక్‌-2 రియాలిటీ సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి. 

7. దర్జీ.. డ్రైవర్‌.. వ్యాపారి.. ఐఎస్‌ఐ ఏజెంట్‌

తనో లేడీస్‌ టైలర్‌. తర్వాత ఆటో డ్రైవర్‌ అవతారమెత్తాడు. ఆ పనిచేస్తూనే సరిహద్దు వస్త్ర వ్యాపారంలోకి దిగాడు. ఆ ముసుగులో కొనసాగుతూనే ఐఎస్‌ఐ ఏజెంట్‌గా మారాడు. వారు చెప్పినట్టల్లా ఆడుతూ.. భారతీయ నౌకాదళం ఉద్యోగుల్ని ఉచ్చులోకి లాగాడు. వారి ద్వారా సేకరించిన దేశ భద్రత రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేతలో కీలకంగా వ్యవహరించాడు. గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా గోద్రా ప్రాంతానికి చెందిన యాకూబ్‌ ఇమ్రాన్‌ గిటేలి(37) ‘ఉగ్ర’ కథ ఇది. 

8. ప్రేమ అని భ్రమించా.. జీవితాన్ని కూలదోశా!

ఎదురింట్లో ఓ ఫ్యామిలీ అద్దెకు దిగుతోంది. అందులో చిలకాకుపచ్చ చుడీదార్‌.. బారుజడతో ఉన్న అమ్మాయి తొలిచూపులోనే నన్నాకట్టుకుంది. మర్నాడు మేడ పైకొచ్చి చూశా. ముంగురుల్ని సుతారంగా వెనక్కి తోస్తూ ముగ్గులేస్తోందా అమ్మాయి. తన మోముతో సూర్యోదయానికి ముందే వెన్నెల కురిపిస్తోంది. ఆమె వేసిన ముగ్గులో నా మనసు బందీ అయిపోయింది. 

9. 2022.. బుక్‌ అవుతోంది!

రోనా సంక్షోభం తర్వాత తెలుగులో సినిమాల ఉద్ధృతి పెరిగింది. 2020 అంతా తుడిచి పెట్టుకుపోవడంతో ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. ఆ ప్రభావం 2021లో స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఆగిపోయిన సినిమాలన్నీ మళ్లీ ముస్తాబై వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. రానున్న చిత్రాల సంఖ్య అధికంగా ఉండటంతో నిర్మాతలు ముందుగానే విడుదల తేదీల్ని ఖరారు చేసేస్తున్నారు. అలా 2021పై దాదాపు కర్చీఫ్‌లు పడిపోయాయి. ఇప్పుడు 2022పై దృష్టి పడింది. వచ్చే ఏడాదిలోనూ ఇప్పటికే విడుదల తేదీలు ఖరారైపోయాయి. 

10. అప్పగించేశారు

టెస్టుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన వేదిక అది. ఫార్మాట్‌ మారింది. ఆటగాళ్లు మారారు. ప్రత్యర్థి బలంగా కనిపిస్తున్నప్పటికీ.. బెదురన్నదే లేకుండా ఆడే హిట్టర్లు, బంతితో బ్యాటుతో సత్తా చాటగల ఆల్‌రౌండర్లు, భయపెట్టే స్పిన్నర్లు, ప్రమాదకర పేసర్లతో కళకళలాడుతున్న టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ను కూడా ఘనంగానే మొదలుపెడుతుందని ఆశించారు అభిమానులు. కానీ ఆ అంచనాలు తల్లకిందులు కావడానికి ఎంతో సమయం పట్టలేదు. బ్యాటింగ్‌ మొదలుపెట్టి స్కోరు బోర్డు మీదికి మూడు పరుగులు చేసేసరికే రాహుల్‌, కోహ్లి ఔట్‌. ఇక్కడే తేలిపోయింది మ్యాచ్‌ ఫలితమేంటో! ఇక మ్యాచ్‌ అంతా ఎదురీతే!

Post a Comment

Previous Post Next Post