తెలుగులో విజయ్‌సేతుపతి ‘సూపర్‌ డీలక్స్‌’



హైదరాబాద్‌: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న నటుడు విజయ్‌ సేతుపతి. ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’లో రాయనంగా ఆయన నటన అలరించింది. కాగా, ఆయన కీలక పాత్రలో త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్‌ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’. విభన్న కథల సమాంతరంగా సాగే ఈ చిత్రంలో సమంత, ఫాహద్‌ ఫాజిల్‌, రమ్యకృష్ణ, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, కమర్షియల్‌గానూ కాసుల వర్షాన్ని కురిపించింది. ముఖ్యంగా ట్రాన్‌జెండర్‌ పాత్రలో విజయ్‌సేతుపతి నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో రాబోతోంది. సిద్ధేశ్వర వైష్ణవి ఫిల్మ్స్‌ ‘సూపర్‌ డీలక్స్‌’ డబ్బింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. త్వరలోనే డబ్బింగ్‌ పనులు పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ చిత్రం తెలుగులోనూ ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

Post a Comment

Previous Post Next Post