ముంబయి: బాలీవుడ్ నటుడు సందీప్ నహర్(33) ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లేఖ రాసి తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంఎస్ ధోనీ, కేసరీ చిత్రాల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్, అక్షయ్‌కుమార్ పక్కన సహాయ నటుడిగా సందీప్ నటించాడు. ఆత్మహత్య చేసుకునేముందు సామాజిక మాధ్యమాల్లో తను చనిపోతున్నట్లు పోస్టు చేశాడు. వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, అందుకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో సందీప్ పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న ముంబయి పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.