కోడి ఆకారంలో మేక


కోడి ఆకారంలో పుట్టిన మేకపిల్ల

పీసీపల్లి: కోడిని పోలిన ఓ మేక జన్మనిచ్చిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పీసీపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే దస్తగిరికి చెందిన మేక గురువారం ఒకే ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చింది. 3 కిలోలు, 1.5 కిలోల బరువు ఉన్న అవి ఆరోగ్యంగా తల్లిని పోలినట్టు ఉన్నా యి. శనివారం ఉదయం అదే మేక మరో పిల్లకు జన్మనిచ్చింది. అయితే అది గురువారం నాటి పిల్లల మాదిరిగా కాకుండా కోడి ఆకారంలో ముక్కు కలిగి ఉంది. శరీరంపై వెంట్రుకలు కూడా లేవు. కేవలం పావు కిలో బరువు మాత్రమే ఉన్న ఆ పిల్ల పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. వింతగా ఉన్న దీనిని చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

Post a Comment

Previous Post Next Post