బస్సెక్కి.. కడుపులో కత్తి దింపి


బస్సెక్కి.. కడుపులో కత్తి దింపి

ఘటనలో గాయపడ్డ చేతన్‌

గజపతినగరం: పాత వివాదాల కారణంగా కొంపంగికి చెందిన విద్యార్థిని బడేవలసకు చెందిన మరో విద్యార్థి శుక్రవారం కత్తితో గాయపరిచాడు. పోలీసుల వివరాల మేరకు ప్రేమ వ్యవహారంలో నాలుగురోజులుగా కర్రి చేతన్‌, సింహాద్రి మురళి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. డిగ్రీ చదువుతున్న చేతన్‌ కళాశాల నుంచి గజపతినగరం నుంచి ఇప్పలవలసకు బస్సులో ఇంటికి బయలుదేరాడు. మురళి కొత్తరోడ్డు వద్ద ఎక్కి కత్తితో పొడిచి పారిపోయాడు. క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post