విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్ష శిబిరం నుంచి కృషి ఐకాన్ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు. గత ఆరురోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. పల్లా దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తెదేపా అధినేత చంద్రబాబు ఈ రోజు విశాఖ రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ముందే పోలీసులు దీక్ష భగ్నం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు దీక్ష చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున తెదేపా నేతలు పల్లా దీక్షకు సంఘీభావం తెలిపారు. పల్లాకు మద్దతు తెలిపేందుకు అమరావతి రైతులు సైతం విశాఖకు వచ్చారు.
పల్లా దీక్షను భగ్నం చేసిన పోలీసులు
AMARAVATHI NEWS WORLD
0