
విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలోని కొందరు నాయకులు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో మంగళవారం వైకాపాలో చేరిన సందర్భంలో పలువురు కార్యకర్తలు నడి రోడ్డుపై వీరంగం సృష్టించారు. కార్యక్రమానికి వెళ్లే క్రమంలో రహదారుల పైనే బీర్లు తాగుతూ, బైకులతో ఇష్టానుసారం విన్యాసాలు చేశారు. మద్యం సీసాలను రోడ్డుపైనే పగలగొట్టి బీభత్సం చేశారు. దాదాపు అరగంట పాటు సాగిన వీరి విపరీత చర్యలతో వాహనదారులు హడలిపోయారు.

