ఛత్తీస్‌గఢ్: దంతరి జిల్లాలో దారుణం జరిగింది. విశ్రామ్‌పూర్ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు దాడిలో యువకుడు మృతిచెందాడు. విండోటోలా అటవీ ప్రాంతంలో కూలి పనులు చేసేందుకు వెళ్లిన యువకుడిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల కాళ్ల మధ్యలో నలిగిపోయిన యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
యువకుడిని తొక్కి చంపిన ఏనుగుల గుంపు
AMARAVATHI NEWS WORLD
0