ప్రముఖ మలయాళ గాయకుడు మృతి


తిరువ‌నంత‌పురం: ప్రముఖ మలయాళ గాయకుడు ఎంఎస్ న‌సీమ్  కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(బుధవారం)తుదిశ్వాస వదిలారు. దూర‌ద‌ర్శ‌న్‌, ఆకాశ‌వాణి, ఇత‌ర స్టేజ్ ప్రోగ్రామ్‌ల‌లో మొత్తం వెయ్యికి పైగా పాటలు పాడి తన శ్రావ్యమైన గొంతుతో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసేవారు.పలు స్టేజ్‌ షోలతో పాటు టెలివిజన్‌ షోలు కూడా నిర్వహించేవారు. రెండు సినిమాల్లో నసీమ్‌ పాడిన పాటలు ఎంతో ప్రజాధరణ పొందాయి. 

Post a Comment

Previous Post Next Post