ఇళ్ల స్థలాలు కేటాయించిన లబ్ధిదారుల జాబితా
పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: పాణ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ జాబితా అస్తవ్యస్తంగా ఉంది. ఒకే రేషన్ కార్డుపై ఇంట్లో ఇద్దరి పేర్ల మీద పట్టాలు కేటాయించారు. డబ్ల్యూఏపీ 133100500018 అనే రేషన్‌కార్డుపై గ్రామానికి చెందిన మహమ్మద్ మున్నికి మేకలబండలోని సర్వేనంబర్ 1205/1లో ప్లాట్ నం.289 ఇంటి స్థలం కేటాయించారు. అదే కార్డుపై చాంద్‌బాషా అనే వ్యక్తికి.. అదే సర్వే నంబర్‌లో 248 సంఖ్య గల మరో ప్లాట్‌ను ఇచ్చారు. పాణ్యం మండలంలో ఇలా ఒకే ఇంట్లో ఇద్దరికి కేటాయించిన ఘటనలు ఐదుకిపైగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై తహసీల్దారు రత్నరాధికను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా..పాణ్యంలో గత అధికారులు కేటాయించిన వారికే ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామని, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయంపై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.