నలుగురిపే పెట్రోల్ పోసి..

అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన ఆచంట మండలం భీమలాపురం గ్రామంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన కాండ్రేగుల నాగలక్ష్మికి ఆచంట గ్రామానికి చెందిన నరేశ్ అనే వ్యక్తికి డబ్బు విషయంలో వివాదాలున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నాగలక్ష్మి సోదరి మంగలక్ష్మిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన నాగలక్ష్మి భర్త, అతని తల్లి గాయపడ్డారు. పెట్రోల్‌ చల్లే క్రమంలో అతనిపై కూడా పడడంతో మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే వారిని అంబులెన్స్‌లో గాయపడ్డ ఐదుగురిని పాలకోల్లులోని హాస్పిటల్‌కు తరలించారు

Post a Comment

Previous Post Next Post