
తారల అందచందాలను సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి అందాలు పొలాల్లో ఏర్పాటుచేసిన తెరలపైకీ ఎక్కడం గమనార్హం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన రైతు చంద్రమౌళి తన రెండు ఎకరాల మిరప పంట పొలంలో సినిమా హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అందరూ నటీమణులను చూస్తారు.. తన పంటపై దృష్టి పెట్టరంటూ సదరు రైతు సంబర పడుతున్నాడు.