నటి ఫొటోని ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్న ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్
హైదరాబాద్: నటి శ్రుతిహాసన్ తాజాగా 35వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె గురువారం తన నివాసంలో బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. పార్టీలో భాగంగా శ్రుతిహాసన్‌తో సన్నిహితంగా దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక.. ‘ప్రియమైన (లవ్ సింబల్) శ్రుతిహాసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేశారు.
ట్విటర్‌లో సైతం ఆమె ఫొటోని షేర్ చేస్తూ.. ‘నా రాణికి జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆమెతో దిగిన ఓ ఫొటోని ట్విటర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. శాంతను పెట్టిన పోస్ట్‌పై స్పందించిన శ్రుతి.. ‘నా ఈరోజును ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. దీంతో శ్రుతి జీవితంలో శాంతను చాలా ప్రత్యేకం అయ్యి ఉండొచ్చు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.