కురుక్షేత్రలో ఆవు వీరంగం


కురుక్షేత్రలో ఆవు వీరంగం.. వైరల్‌ వీడియో!

కురుక్షేత్ర: హరియాణాలోని కురుక్షేత్రలో ఓ ఆవు వీరంగం సృష్టించింది. రోడ్డుపై ఎరుపు రంగు దుస్తులు ధరించి కనిపించిన వారందరినీ కుమ్మేసింది. సైకిల్‌పై ఎరుపు వర్ణం పోలిన దుస్తులు ధరించి వెళ్తున్న ఓ బాలుడిని పొడిచింది. దీంతో బాలుడు కిందపడిపోయాడు. గమనించిన ఓ మహిళ కాపాడేందుకు వెళ్లగా ఆమెపైనా దాడి చేసింది. వీరితోపాటు రోడ్డుపక్కన వెళ్తున్న వారిని సైతం వదల్లేదు. గోవును అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేసిన వారిపై కూడా తన ప్రతాపం చూపింది. ఈ ఘటనతో పిల్లలు, పెద్దలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Post a Comment

Previous Post Next Post