సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!

సంక్రాంతి వస్తోందంటే చాలు...అభిమాన కథానాయకుడి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. తొలి రోజు తొలి ఆటతోనే సినిమాల్ని ఆస్వాదించేందుకు సిద్ధమైపోతుంటారు. పండగ సినిమాలంటే అందులో ప్రత్యేకమైన అంశాలు పుష్కలంగానే ఉంటాయి. కథానాయకులకి దీటుగా...నాయికల పాత్రల్నీ ప్రత్యేకంగానే డిజైన్‌ చేస్తుంటారు. ఈసారి పండగ సినిమాలు అనూహ్యంగానే ఖరారైనా...వాటిలో హీరోలు నలుగురే అయినా...అందగత్తెలు చాలా మందే థియేటర్లకి రారమ్మంటూ స్వాగతం పలుకుతున్నారు. శ్రుతిహాసన్, మాళవికా శర్మ, నివేతా పేతురాజ్, అమృతా అయ్యర్, హెబ్బా పటేల్, నభా నటేష్, అను ఇమ్మానుయేల్, మాళవికా మోహనన్‌...వీళ్లంతా సంక్రాంతి భామలే.

రవితేజతో కలిసి...

సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!

శ్రుతిహాసన్‌ మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించబోతోంది.  ‘కాటమరాయుడు’ తర్వాత విరామం తీసుకున్న ఆమె, మళ్లీ రవితేజతో జోడీకట్టి ‘క్రాక్‌’లో నటించారు. ఆ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘బలుపు’ తర్వాత రవితేజ - శ్రుతి కలిసి చేసిన సినిమా ఇదే. శ్రుతి సంక్రాంతి భామ కావడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఆమె నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ కూడా సంక్రాంతి సందర్భంగానే విడుదలైంది. శ్రుతికి తోడు మరో ప్రత్యేక అందం ఆకర్షించబోతోంది. ‘భూమ్‌ బద్దల్‌’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో అప్సరా రాణి ఆడిపాడింది. 


సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!

అందాలే అందాలు

సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!

‘రెడ్‌’ సినిమాలో ఇద్దరు రామ్‌లు కనిపించబోతున్నారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. హీరో ఇద్దరిలా కనిపిస్తాడంటే, కథానాయికలు కూడా ఇద్దరు ఉంటారని అనుకుంటాం. కానీ ఈ సినిమాలో నలుగురు భామలు సందడి చేయబోతున్నారు. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ ప్రధాన నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్‌ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఈ కథానాయికల్లో నివేదా పేతురాజ్‌ గతేడాది సంక్రాంతికి ‘అల... వైకుంఠపురములో’ సినిమాతో విజయాన్ని అందుకుంది.


సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!

అల్లుడితో ముగ్గురు

సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!

ఈసారి సంక్రాంతి అల్లుడిగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ మురిపించబోతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్‌’లోనూ ముగ్గురు ముద్దుగుమ్మలున్నారు. నభా నటేష్, అను ఇమ్మానుయేల్‌ నాయికలుగా నటించగా, ప్రత్యేక గీతంలో మోనాల్‌ గజ్జర్‌ ఆడిపాడింది. వీరిలో అను ఇమ్మానుయేల్‌కి ఇది రెండో సంక్రాంతి సినిమా. ఆమె ఇదివరకు ‘అజ్ఞాతవాసి’తో సందడి చేసింది.


సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!

ఏటా సంక్రాంతి బరిలో ఓ అనువాద చిత్ర తప్పకుండా ఉంటుంది. ఈసారి పండగకి తమిళ హీరో విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ విడుదలవుతోంది. ఇందులో మాళవిక మోహనన్‌ కథానాయిక. ఇదివరకు సంక్రాంతికే విడుదలైన ‘పేట’లో మాళవిక మోహనన్‌ నటించింది. 

సంక్రాంతి ముగ్గులే కాదు.. ముద్దు గుమ్మలూ రెడీ!

 

Post a Comment

Previous Post Next Post