కిరాతకం: వివాహం కావడం లేదని


ఐదేళ్ల చిన్నారిని గొంతుకోసి హత్య తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని కిరాతకం 

చిక్కబళ్లాపురం(కర్ణాటక): ఇంట్లో దివ్యాంగురాలైన చిన్నారి ఉండటం వల్లనే  తనకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఓ వ్యక్తి ఐదేళ్ల వయసున్న తన అన్న కుమార్తెను కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. హృదయవిదారకమైన ఈ అమానుష ఘటన తాలూకా పరిధిలోని అంగరేకనహళ్లిలో చోటు చేసుకుంది.  గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, శంకర్‌లు అన్నదమ్ములు. వీరిది ఉమ్మడి కుటుంబం. కృష్ణమూర్తికి  ఐదేళ్ల వయసున్న చర్విత అనే కుమార్తె ఉంది. బాలిక పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఇక శంకర్‌కు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరలేదు. తన అన్న కుమార్తె దివ్యాంగురాలైనందున తనకు సంబంధాలు కుదరడం లేదని గొడవపడేవాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుండగా తన వదిన ఎదురుగానే బాలిక గొంతుకోసి ఉడాయించాడు. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడకక్కడే ప్రాణాలు వదిలింది. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు శంకర్‌ కోసం గాలింపు చేపట్టారు.   

Post a Comment

Previous Post Next Post