ANW : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ జాన్ హుబెర్ (41) ఆదివారం మృతి చెందారు. డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు ఆయన ల్యూక్‌హార్పర్‌గా సుపరిచితమే. హార్పర్ మృతి విషయాన్ని ఆయన భార్య ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ఊపరితిత్తుల సమస్యతో హార్పర్ మరణించినా.. ఆయనకు కొవిడ్ నిర్ధారణ కాలేదని తెలిపారు. హార్పర్ 2019 చివర్లో డబ్ల్యూడబ్ల్యూఈను వీడి ఆల్ ఎలైట్ రెజ్లింగ్‌లో చేరారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
‘‘జాన్ హుబెర్ మరణం విషాదానికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం’’ అని డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్ చేసింది. ర్యాండీ ఓర్టన్, షేమస్, ట్రిపుల్ హెచ్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్లు హార్పర్ మృతికి ట్విటర్లో సంతాపం వ్యక్తం చేశారు.
1979లో న్యూయార్క్‌లో జన్మించిన హ్యూబర్ రెజ్లర్‌గా 1990లో తన కెరీర్ ప్రారంభించారు. 2003లో రోచెస్టర్ ప్రోరెజ్లింగ్‌లో బ్రోడై లీ పేరుతో రింగ్‌లోకి దిగారు. 1995లో కెవిన్ స్మిత్ సినిమా మాల్రాట్స్లో ఓ పాత్ర పోషించారు. 2012లో డబ్ల్యూడబ్ల్యూఈతో ఒప్పందం చేసుకొని ల్యూక్‌హార్పర్‌గా పేరుమార్చుకొని బరిలోకి దిగారు. 2019 చివరి వరకు కొనసాగారు.