నా భర్త హత్య వెనుక ఎమ్మెల్యే: అపరాజిత


నా భర్త హత్య వెనుక ఎమ్మెల్యే: అపరాజిత

ప్రొద్దుటూరు: కడప జిల్లాలో తెలుగుదేశం నేత నందం సుబ్బయ్య హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే స్థలంలోనే జరిగిన ఈ హత్య వెనక ఎమ్మెల్యే ప్రసాద్‌ రెడ్డి, ఆయన బావమరిది ఉన్నారని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి కొంత మంది వారి ఇంటి చుట్టూ తిరిగారని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని.. ఎక్కడికైనా వచ్చి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు అపరాజిత తెలిపారు. ఈ కేసులో లొంగిపోయిన నలుగురు నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత సుబ్బయ్య దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మారణాయుధాలతో దాడి చేయడంతో సుబ్బయ్య తల ఛిద్రమైంది. రాజకీయ కోణంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post