లాక్‌డౌన్ కాలంలో పరాయి రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ సొంత గ్రామాలకు చేరవేసిన ప్రముఖ బహుభాషా నటుడు సోనుసూద్‌పై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రముఖుల ప్రశంసలకు నోచుకొన్న సోనుసూద్ తాజాగా మెగాస్టార్ అభిమానానికి పాత్రుడయ్యాడు. తాజాగా చిరంజీవిని సోనుసూద్ కలువగా...
లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపించిన సోనుసూద్ దేశవ్యాప్తంగా రియల్ హీరో అయ్యాడు. వెండి తెర మీదనే కాదు.. నిజ జీవితంలో కూడా హీరోనేనే సంకేతాలను కష్టకాలంలో పంపించారు. అలా వలస కార్మికుల కష్టాల్లో భాగమయ్యారు.
లాక్‌డౌన్‌లో అందించిన నిస్వార్ధ సేవలను ప్రశంసిస్తూ సోనుసూద్‌పై పుస్తకం ప్రచురితమైంది. ఐయామ్ నో మెస్సయా పేరుతో వచ్చిన పుస్తకం పాఠకుల నుంచి అత్యంత స్పందన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఆచార్య షూటింగులో చిరంజీవిని కలిసి సోనుసూద్ పుస్తకాన్ని అందించారు.
సోనుసూద్ పుస్తకం బహుకరించిన సందర్భంగా చిరంజీవి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. కంగ్రాట్స్ సోనుసూద్. ఐయామ్ నో మెస్సయా పుస్తకంతో మరోసారి నీవు హీరోగా రుజువు చేసుకొన్నావు. సాధారణంగా హీరోలు పుట్టరు.. వారి చేసే గొప్ప కార్యక్రమాలతోనే హీరోలుగా మారుతారు. ఆపదకాలంలో వేలాది మందిని అక్కున చేర్చుకొన్నావు. నీ ప్రయాణం అందరికి స్పూర్తిని కలిగిస్తుంది అని చిరంజీవి ట్వీట్ చేశారు. అమెజాన్‌లో పుస్తకం వివరాలను తెలుపుతూ ఫోటోను షేర్ చేశారు.
లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగులతో బిజీగా మారిపోయారు. తెలుగులో అల్లుడు అదుర్స్, ఆచార్య సినిమాల షూటింగులో పాల్గొంటున్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న అల్లుడు అదుర్స్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు