చిత్ర యూనిట్‌లో ఎనిమిది మందికి కరోనాన పాజిటివ్‌సె ల్ఫ్ క్వారంటైన్‌లోకి సూపర్ స్టార్ రజనీకాంత్
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను బ్యాడ్ న్యూస్. రజనీకాంత్ రాబోయే తమిళ చిత్రం 'అన్నాట్టే' మరోసారి కరోనావైరస్ మహమ్మారి సెగ తగిలింది. కరోనా, లాక్‌డౌన్ ఆంక్షలతో దీర్ఘకాలంగా వాయిదా పడి, ఇటీవలే తిరిగి ప్రారంభమైన షూటింగ్‌కు మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఈ మూవీ సెట్లో కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో అన్నాట్టే షూటింగ్ నిలిపిశారు. యూనిట్‌లో ఏకంగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రజనీకాంత్‌కు సమీపంగా మెలిగిన సాంకేతిక సిబ్బందికి కరోనా సోకిందని, దీంతో ముందు జాగ్రత్తగా, షూటింగ్ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. దీంతో రజనీ గురువారం చెన్నైకి తిరిగి వెళ్లనున్నారని భావిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ఇచ్చిన అనంతరం రజనీకాంత్, నయనతార తదితరులు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు