మహబూబాబాద్ : జిల్లాలోని గార్ల మండలం.. రాజుతండ గ్రామ పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లిని కుటుంబీకులు అంగీకరించరనే భయంతో బావిలో దూకి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు... రాజు తండా గ్రామపంచాయతీ వడ్ల తండాకు చెందిన మైనర్ గుగులోతు వెంకటేష్ (17), అమ్మాయి భూక్య ప్రవీణ (22) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గత మూడు రోజులుగా వీరిద్దరు కనిపించకపోవడంతో రెండు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వారిద్దరు ఏమయ్యారనే దానిపై బంధువులు.. గ్రామస్థులతో కలిసి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. (చదవండి : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య)
ఈ నేపథ్యంలో నేడు తెల్లవారుజామున తండా శివారు ప్రాంతంలోని వ్యవసాయ బావిలో వీరిద్దరు శవాలై తేలారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులు బావిలో మృతదేహాలు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బావి నుంచి వెలికి తీశారు. అనంతరం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓకే తండాలో సమీప ఇళ్లలో ఉండే ఇద్దరు చనిపోవడంతో విషాద చాయలు అలుముకున్నాయి